ఏపీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖపట్నంలోని కూర్మన్నపాలెం కూడలిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ, నిర్వాసితుల రాస్తారోకోలో ఉద్రిక్తత నెలకొంది. విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నేషనల్ హైవేను దిగ్భందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని నిలువరిస్తున్నారు. కూర్మన్నపాలెం జంక్షన్‌లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్రిక్తతపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు.