ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న.. ఆస్కార్ అవార్డుల(Oscar Awards) ఎంపికల పండుగ నేడు మొదలైంది. ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు భారతీయ కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ప్రారంభం అయ్యాయి. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ ఆస్కార్ వేడుకలకు వేదికైంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు, యాంకర్ జిమ్మీ కిమ్మెల్ ఈ వేడుకలకు హోస్ట్ గా చేస్తున్నాడు. హాలీవుడ్ మాత్రమే కాక దేశ విదేశాల సినీ పరిశ్రమల నుంచి ఎంతోమంది గొప్ప గొప్ప నటులు, నటీమణులు, టెక్నీషియన్స్ ఆస్కార్ వేడుకలకు విచ్చేస్తున్నారు. నటీనటులతో ఆస్కార్ వేదిక అంగరంగ వైభవంగా కనువిందు చేస్తుంది. స్టార్ నటుల గ్లామర్, కాస్ట్యూమ్ , కామెంట్స్, హోస్టింగ్ చాలా అద్భుతంగా ఉంది.
అయితే RRR కి ఆస్కార్(Oscar Awards) వస్తుందా? రాదా? అనే విషయంపై తెలుగు సినీ ఇండస్ట్రీ చాలా ఉత్కంఠగా వేచిచూస్తుంది. మన RRR సినిమా నుంచి రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, సెంథిల్ కుమార్, కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ మాస్టర్.. లతో పాటు ఉపాసన, రాజమౌళి తనయుడు కార్తికేయతో పాటుగా మరికొంతమంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Read Also: వెంకయ్యకి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం నాకు నచ్చలేదు: రజనీకాంత్
Follow us on: Youtube Instagram