ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి(Kirankumar reddy) కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది. కాగా కాంగ్రెస్ తో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే, స్పీకర్ గా పదవులు చేపట్టారు. 2010లో ఉమ్మడి ఏపీకి సీఎంగా ఎంపికయ్యారు. దాదాపు మూడున్నర సంవత్సరాలు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ విభజన అనంతరం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతంగా ఓ పార్టీ ఏర్పాటుచేసి 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికల అనంతరం మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.