29.2 C
Hyderabad
Monday, May 29, 2023

హైదరాబాద్ లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మరోసారి పోస్టర్ల కలకలం

Poster War |దేశంలో ప్రస్తుతం రాజకీయ నాయకులకు సంబంధించిన పోస్టర్ల ట్రెండ్ నడుస్తోంది. ప్రత్యర్థి పార్టీల నాయకులను టార్గెట్ చేస్తూ ఇతర పార్టీల నేతలు పోస్టర్లు అంటిస్తున్నారు. తెలంగాణలో కూడా కొంతకాలంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పోస్టర్ల వార్(Poster War) జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ లోని ఉప్ప‌ల్ – నార‌ప‌ల్లి ఫ్లై ఓవ‌ర్ నిర్మాణం విష‌యంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ‘మోదీ గారు ఈ ఫ్లైఓవర్ ఎన్ని సంవత్సరాలు కడతారు..? 2018, మే 5న ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ పనులు ప్రారంభమై.. ఇప్పటికీ ఐదేళ్లు పూర్తయినా 40 శాతం పనులు కూడా పూర్తి కాలేదంటూ’ అంటూ మెట్రో పిల్లర్లపై పోస్టర్లు ఏర్పాటుచేశారు. ఈ పోస్టర్లపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నేతలే కావాలనే మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. పోస్టర్లను ఏర్పాటు చేసినవారిని వెతికే పనిలో పడ్డారు.

Read Also: అది నా బాధ్యత.. బంగ్లా ఖాళీ చేస్తా: రాహుల్ గాంధీ
Follow us on:  YoutubeInstagramGoogle News

Latest Articles

నేడు మ్యాచ్ జరుగుతుందా..?

స్వతంత్ర వెబ్ డెస్క్: క్రికెట్ అభిమానుల కన్నుల పండుగ ఐపీఎల్. ఈ ఏడాది కూడా అభిమానులకి మంచి వినోదాన్ని ఇచ్చింది. ఇంకా 16వ సీజన్ విజేతగా ఎవరు నిలుస్తారో..? కప్ ఎవరి సొంతం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
250FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్