Poster War |దేశంలో ప్రస్తుతం రాజకీయ నాయకులకు సంబంధించిన పోస్టర్ల ట్రెండ్ నడుస్తోంది. ప్రత్యర్థి పార్టీల నాయకులను టార్గెట్ చేస్తూ ఇతర పార్టీల నేతలు పోస్టర్లు అంటిస్తున్నారు. తెలంగాణలో కూడా కొంతకాలంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పోస్టర్ల వార్(Poster War) జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ లోని ఉప్పల్ – నారపల్లి ఫ్లై ఓవర్ నిర్మాణం విషయంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ‘మోదీ గారు ఈ ఫ్లైఓవర్ ఎన్ని సంవత్సరాలు కడతారు..? 2018, మే 5న ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ పనులు ప్రారంభమై.. ఇప్పటికీ ఐదేళ్లు పూర్తయినా 40 శాతం పనులు కూడా పూర్తి కాలేదంటూ’ అంటూ మెట్రో పిల్లర్లపై పోస్టర్లు ఏర్పాటుచేశారు. ఈ పోస్టర్లపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నేతలే కావాలనే మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. పోస్టర్లను ఏర్పాటు చేసినవారిని వెతికే పనిలో పడ్డారు.
హైదరాబాద్ లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మరోసారి పోస్టర్ల కలకలం
0
579
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


