25.3 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా రాబోతున్న ‘తలకోన’

అక్షర క్రియేషన్ పతాకంపై స్వప్న శ్రీధర్ రెడ్డి సమర్పణలో దేవర శ్రీధర్ రెడ్డి ( చేవెళ్ల) నిర్మాతగా, నగేష్ నారదాసి దర్శకుడుగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ “తలకోన” . బోల్డ్ బ్యూటీ అప్సర రాణి ఈ చిత్రంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సంద్భంగా ‘తలకోన’ దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ… ‘‘క్రైమ్ థ్రిల్లర్‌తో సాగే ఈ కథాంశం మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో ఉండబోతోంది. అయితే ఫారెస్ట్ అనగానే కేవలం ప్రకృతి అందాలే కాదు.. అందులో ఇంకో కోణం కూడా ఉటుంది. అదే విధంగా పాలిటిక్స్‌ని కూడా మిక్స్ చేసి చూపించాము. అంతే కాకుండా ప్రకృతికి విరుద్ధంగా వెళితే జరిగే పరిణామాలు కూడా తెలిపే ప్రయత్నం చేశాం. తలకోన ఫారెస్ట్‌లోకి హీరోయిన్ కొంతమంది స్నేహితులతో కలిసి వెళ్తుంది..ఎంత మంది వెళ్లారు? ఎంతమంది తిరిగొచ్చారు? అనేది ప్రధానాంశంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా రూపొందిస్తున్నాము. అందుకు తగ్గ టీమ్‌ను, టెక్నికల్ టీమ్‌ను కూడా సినిమాకు తీసుకున్నాం. అంతేకాకుండా కంప్లీట్‌గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్‌గా ఈ సినిమా నవంబర్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అని తెలిపారు.

నిర్మాత దేవర శ్రీధర్ రెడ్డి(చేవెళ్ల) మాట్లాడుతూ… ‘‘‘తలకోన’ సినిమా నిర్మాతగా నా మొదటి ప్రయత్నం. షూటింగ్ అంతా అద్భుతంగా జరిగింది. అప్సర రాణి వెండి తెరపై గ్లామర్ క్వీన్ అని అందరికీ తెలుసు కానీ ఈ సినిమాతో యాక్షన్ క్వీన్‌గా కూడా ఆమెకు మంచి నేమ్ వస్తుంది. అలాగే అజయ్ ఘోష్, శ్రవణ్ వంటి సీనియర్ నటుల పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నేను కొత్త వాడినైనా.. నా టెక్నిషియన్స్ చాలా ఎంకరేజ్ చేస్తూ పని చేశారు . కనుక ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.

నటీనటులు: అప్సర రాణి, అశోక్ కుమార్, అజయ్ ఘోష్, ఉగ్రం మంజు, విజయ్ రంగరాజు, రాజా రాయ్, యోగి కత్రి, కరణ్ విజయ్, డెబోరో, ముస్కాన్, చంద్రిక, అరుణ, లత తదితరులు నటించిన ఈ చిత్రానికి
సమర్పణ : స్వప్న శ్రీధర్ రెడ్డి
పీఆర్వో: బాసింశెట్టి వీరబాబు
డిఓపి : మల్లికార్జున్ – EHV ప్రసాద్
మ్యూజిక్ : సుభాష్ ఆనంద్
ఫైట్స్ : వింగ్ చన్ అంజి
ఎడిటింగ్ :ఆవుల వెంకటేష్
కొరియోగ్రఫీ : చార్లీ
ఆర్ట్ : విజయ కృష్ణ
స్టిల్స్: భద్రం
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : పరిటాల రాంబాబు
ఆడియోగ్రఫీ : సాగర్
నిర్మాత: దేవర శ్రీధర్ రెడ్డి (చేవెళ్ల)
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నగేష్ నారదాసి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్