30.2 C
Hyderabad
Saturday, December 2, 2023
spot_img

తెలంగాణపై వరాల జల్లు కురిపించిన ప్రధాని నరేంద్ర మోడీ

స్వతంత్ర వెబ్ డెస్క్: దేశంలో పండగల సీజన్ మొదలైందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మనం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు తెచ్చుకున్నామన్నారు. మహబూబ్‌నగర్‌లో ఆదివారం వర్చువల్ విధానంలో రూ. 13500 కోట్ల అభివృద్ధి పనులను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా.. కుటుంబ సభ్యుల్లారా అంటూ తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్రంపై వరాలు కురిపించారు ప్రధాని మోడీ. కరోనా తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచానికి తెలిసిందన్నారు. పసుపుపై పరిశోధనలు జరిగాయన్నారు. తెలంగాణలో పసుపు బోర్డ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ప్రధాని మోడీ తెలిపారు. పసుపు బోర్డ్ ఏర్పాటుతో పసుపు రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొత్త భవనాలను ప్రారంభించకున్నామని చెప్పారు. అంతేగాక, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎనిమినెంట్‌గా తీర్చిదిద్దుతామన్నారు. మరోవైపు, ములుగు జిల్లాల్లో సమ్మక్క సారక్క పేరుతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ. 900 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.

తెలంగాణలో ఇవాళ రూ. 13500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. కేంద్రం చేపట్టిన ఈ పనులతో ఎంతో మందికి ఉపాధి కలుగుతుందన్నారు. తెలంగాణలో ఎన్నో జాతీయ రహదారులు చేపట్టామన్నారు. హైవేల నిర్మాణంతో అన్ని రాష్ట్రాలతో తెలంగాణ అనుసంధానం పెరిగిందన్నారు. దేశంలో నిర్మించే ఐదు టెక్స్‌టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించామని ప్రధాని మోడీ తెలిపారు.

హనుమకొండలో నిర్మించే టెక్స్‌టైల్ పార్క్‌తో వరంగల్, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులతో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అనుసంధానం పెరుగుతుందని ప్రధాని మోడీ తెలిపారు. కాగా, తాను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. అయితే, సభలో ఇటు బీఆర్ఎస్ పైగానీ, కాంగ్రెస్ పైగానీ విమర్శలు చేయకపోవడం గమనార్హం.

కాగా, చాలా కాలంగా తెలంగాణలో పసుపు బోర్డు, ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం ఇచ్చిన హామీ మేరకు తాజాగా, ప్రధాని మోడీ ఈ రెండు కీలక ప్రాజెక్టులపై ప్రకటన చేయడంతో తెలంగాణ బీజేపీ నేతలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ప్రధాని మోడీ ప్రకటించారంటూ ఇతర పార్టీలు అంటున్నాయి.

కేసీఆర్ సర్కారుపై కిషన్ రెడ్డి విమర్శలు
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందన్నారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధిలో ట్రిపుల్ ఆర్ రోడ్డు ఒక గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. రూ. 26 వేల కోట్లతో త్రిపుల్ ఆర్ రోడ్డును నిర్మించబోతున్నామన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 8 జిల్లాలను అనుసంధానం చేస్తూ దీన్ని నిర్మించబోతున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ కోసం వేలు, లక్షల కోట్లు ఖర్చు చేసి కేంద్రం అభివృద్ది పనులు చేస్తోందన్నారు. ప్రధాని మోడీ అభివృద్ధి పనులు ప్రారంభించడానికి ఇక్కడికి వస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు తీరిక లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. వాళ్లకు ఓటు బ్యాంక్ రాజకీయాలే ముఖ్యమని విమర్శించారు. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి లేరని ఎద్దేవా చేశారు.

గత 9 ఏళ్లలో తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం లక్షా 20వేల కోట్లు ఖర్చు పెట్టిందన్నారు కిషన్ రెడ్డి. రూ. 64000 కోట్లతో ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నామని తెలిపారు. సూర్యపేట నుంచి ఖమ్మం వరకు నాలుగు లైన్ల రోడ్డును నిర్మిస్తామన్నారు. భారతమాల ప్రాజెక్టు కింద రూ. 2460 కోట్లు ఖర్చు పెడుతోందన్నారు.

Latest Articles

‘సాగర్’ వివాదంపై అంబటి రాంబాబు ప్రజెంటేషన్

అమరావతి: నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ చర్య న్యాయమైనదని మంత్రి చెప్పారు. నాగార్జున సాగర్ అంశంపై తప్పుడు రాతలు రాస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్