ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద మృతి

పశ్చిమ బెంగాల్ ​లోని దుర్గాపుర్​లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుల్లో ఏడాదిన్నర చిన్నారి, మరో ఆరేళ్ల బాలుడు ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని.. పరిస్థితిని సమీక్షించారు. సూసైడ్ కి సంబందించిన ఆధారాలు వెతుకగా.. ఓ సూసైడ్​ నోట్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో టీచర్​ ఎలిజబిలిటి టెస్ట్​ స్కామ్​లో ఉన్నవారే తమ మృతికి కారణమని రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనకు సంభందించిన వివరాలను పోలీసులు తెలుపుతూ.. మృతులు అమిత్ కుమార్ మొండల్ (35), రూపా మొండల్ (31) ఇద్దరు దంపతులని..వీరి పిల్లలు పిల్లలు నిమిత్ కుమార్ మొండల్ (6), నిఖితా మొండల్​(ఏడాదిన్నర వయసు)గా గుర్తించారు. అయితే ఘటనాస్థలి వద్ద రూపా, ఆమె ఇద్దరి పిల్లలు మృతదేహాలు కింద పడి ఉన్నాయని.. అమిత్​ మృతదేహం సీలింగ్​ ఫ్యాన్​కు వేలాడుతూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల మొబైల్​లో ఓ సూసైడ్​ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టీఈటీ కుంభకోణంలో పాల్గొన్నవారే తమ మృతికి కారణమన్నట్లు అందులో​ ఓ మెసేజ్​​ ఉంది. స్థానికులు మాత్రం ఇది అత్మహత్య కాదని, కచ్చితంగా హత్యేనని ఆరోపిస్తున్నారు. మరికొందరైతే వారి కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయని.. అందుకే ఎవరో వీరిని హత్య చేసి ఉంటారని చెబుతున్నారు. ఇందులో ఏది సత్యమో, ఏది అసత్యమో పోలీసులు తేల్చే వరకు వేసి చూడాల్సిందే.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్