స్వతంత్ర వెబ్ డెస్క్: విశాఖ టీడీపీ పార్టీలో (TDP) కుదుపు చోటు చేసుకుంది. చంద్రబాబుకు(Chandrababu) జనసేన పార్టీ షాక్ ఇచ్చింది. టీడీపీ మాజీ మంత్రి పడాల అరుణ (Padala Aruna)జనసేనలో చేరనున్నారు. ఇవాళ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు అరుణ. వారాహి టూర్ లో ఇదే తొలి చేరిక కానుంది. గజపతి నగరం ఎమ్మెల్యేగా పనిచేసిన పడాల అరుణ…మొన్నటి వరకు టీడీపీ దూరంగా ఉన్నారు. ఈ తరుణంలోనే.. తాజాగా టీడీపీ మాజీ మంత్రి పడాల అరుణ జనసేనలో చేరనున్నారు.
కాగా, నేటి నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pavan Kalyan)మూడో విడత వారాహి యాత్ర ప్రారంభం కానుంది. పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్ర విశాఖ నుంచే ప్రారంభం అవుతుంది. ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం విశాఖలోని జగదాంబ సెంటర్ లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొంటారు.