స్వతంత్ర వెబ్ డెస్క్: టీఎస్‌పీఎస్సీ (Tspsc) కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రికత్త చోటచేసుకుంది గ్రూప్-2 (Group -2) వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ, టీపీసీసీ, టీజేఎస్ టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆఫీస్ ముందు వేలాది మంది అభ్యర్థులు బైఠాయించారు. వరుస పరీక్షల నేపథ్యంలో ప్రిపరేషన్‌కు తమకు సమయం లేదని చెబుతూ గ్రూప్-2 వాయిదా వేయాలని కోరారు. టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులకు కాంగ్రెస్ (Congress), టీజేఎస్(TJS) మద్దతు తెలిపింది. కోదండరాం, దయాకర్, కాంగ్రెస్ నేతలు నిరనసలో పాల్గొన్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో అభ్యర్థులను పక్కకి పంపించి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు పోలీసులు.
ఇప్పటికే ఈ నెల 3 నుంచి 22 వరకు గురుకుల, జేఎల్, డీఎల్ పరీక్షలు జరుగుతున్నాయని.. వచ్చే నెలలో టెట్ పరీక్ష ఉందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గ్రూప్స్‌కు చదివేందుకు సమయం లేదని వాపోయారు. అంతేగాక ఇప్పటికే పలు పేపర్ లీకేజీ జరిగిన అదే బోర్డుతో ఎగ్జామ్స్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. దీంతో విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఆగష్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగాల్సి ఉంది. మొత్తం 5,51,943 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు.