28.2 C
Hyderabad
Tuesday, February 18, 2025
spot_img

గృహలక్ష్మి పథకానికి నేటితో గడువు ముగియనుందా? కీలక ప్రకటన చేసిన మంత్రి

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘గృహలక్ష్మీ’ (Gruha laxmi) పథకానికి సంబంధించి మంత్రి ప్రశాంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గృహలక్ష్మీ పథకానికి ఇవాళ్టి వరకే గడువు అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. గృహలక్ష్మీ పథకం కింద సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మూడు లక్షల రూపాలయను కేటాయిస్తుంది. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. దరఖాస్తు చేసేందుకు ప్రజలు పోటీ పడుతున్నారు.

అయితే తొలి విడతలో భాగంగా దరఖాస్తుకు ఈ నెల 10 వరకే గడువు వుండటంతో ప్రభుత్వ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. అయితే గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులు స్వీకరించబడవు అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంతి రెడ్డి స్పందించారు.  గృహలక్ష్మీ దరఖాస్తుల విషయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు దుష్ఫ్రచారం చేస్తున్నాయని.. వాటిని నమ్మొద్దని మంత్రి వేముల (Minister vemula) ప్రజలకు సూచించారు. ఖాళీ స్థలం ఉన్నవారెవరైనా సరే గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

 ప్రస్తుతం మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేళ ఇళ్లు పూర్తయితే.. రెండో దశలో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఇళ్లు లేని పేదలు ఆందోళన చెందవద్దని, దశలవారీగా ఇంటి నిర్మాణాల కోసమే ఈ పథకం అమలు చేస్తున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కాగా ఆగస్టు 20వ తేదీలోపు గృహలక్ష్మీ పథకం మొదటి దశ దరఖాస్తుల పరీశీలన ప్రక్రియను పూర్తి చేసి లబ్ధిదారుల జాబితాను ప్రకటించేందుకు అధికార యంత్రాంగం కసరత్తులు చేస్తోంది. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేశారు. జిల్లా మంత్రి ఆమోద ముద్రతో తుది జాబితాను రూపొందించనున్నారు.

Latest Articles

చైనాను శత్రుదేశంగా చూడొద్దన్న శామ్ పిట్రోడా

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శామ్ పిట్రోడా మరోసారి హాట్‌ టాపిక్ అయ్యారు. చైనా పట్ల భారతదేశం అనుసరిస్తున్న వైఖరి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చైనాను శత్రువులా భారతదేశం చూడకూడదని శామ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్