ఎన్సీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా సుప్రియా సూలే

స్వతంత్ర, వెబ్ డెస్క్: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా తన కుమార్తె సుప్రియా సూలే, సీనియర్ నేత ప్రఫుల్ పటేల్‌ను నియమించారు. ముంబయిలో జరిగిన పార్టీ 25వ వ్యవస్థాపక దినోత్సవలో ఆయన ఈ ప్రకటన చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సుప్రియా సూలేకు మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, లోక్ సభ కోఆర్డినేషన్ బాధ్యతలను అప్పగిచారు. అలాగే ప్రఫుల్ పటేల్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా, గుజరాత్, జార్ఖండ్ వ్యవహారాలను చూసుకోనున్నారు. కీలక నేత అజిత్‌ పవార్‌ ఎదుటే ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఎన్సీపీలో అజిత్ చీలక తెస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ నియామకాలకు ప్రాధాన్యం ఏర్పడింది. కాగా గత నెలలోఎన్సీపీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు శరద్ పవార్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పార్టీ నేతలంతా ఆయన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

Latest Articles

జగన్‌కు మంత్రి లోకేష్‌ సవాల్

మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు మంత్రి లోకేష్‌ సవాల్ విసిరారు. జగన్‌ ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉన్నానని.. డీఎస్సీపై అనుమానాలుంటే సమాధానం చెప్తానని అన్నారు. ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్