బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.. ఈ సారి అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ‘సోదరా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుతో పాటు సంజోష్ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీబంసాల్, ఆరతి గుప్తా హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందు రానుంది. మైనంపల్లి మన్మోహన్ దర్శకత్వంలో క్యాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. తెలుగు చిత్రసీమలో ఎందరో సోదరులు ఉన్నారని, అలాంటి సోదరులందరి బంధాన్ని అద్దం పట్టేలా చూపించడానికి ఈ సోదరా వస్తోందని చెప్పారు. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు తనలోని మరో కోణాన్ని చూడబోతున్నారని సంపూర్ణేష్ బాబు తెలిపారు.