30.6 C
Hyderabad
Monday, April 21, 2025
spot_img

‘మ్యాడ్ స్క్వేర్’ ట్రైలర్ వచ్చేసింది

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా వస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’పై ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రచార చిత్రాలు, పాటలు విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ముఖ్యంగా టీజర్, అందులోని సంభాషణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇక ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’పై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.

బుధవారం ఉదయం హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో ‘మ్యాడ్ స్క్వేర్’ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సినీ అభిమానుల సమక్షంలో ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ట్రైలర్ నవ్వులు పూయించింది. మొదటి భాగంతో పోలిస్తే రెట్టింపు వినోదాన్ని మ్యాడ్ స్క్వేర్ లో చూడబోతున్నామని ట్రైలర్ తో మరోసారి రుజువైంది.

ట్రైలర్ ను గమనిస్తే, మ్యాడ్ విజయానికి కారణమైన ప్రత్యేక శైలి హాస్యం, ప్రధాన పాత్రల అల్లరిని మ్యాడ్ స్క్వేర్ లో కూడా చూడబోతున్నామని అర్థమవుతోంది. హాస్యాస్పదమైన సంభాషణలు మరియు విచిత్రమైన పరిస్థితులతో మ్యాడ్ స్క్వేర్ వినోదాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తుంది. అలాగే తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం ట్రైలర్ కు ప్రధాన బలాలలో ఒకటిగా నిలిచింది. విడుదలైన నిమిషాల్లోనే ఈ ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రానికి సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘లడ్డు గానీ పెళ్లి, ‘స్వాతి రెడ్డి’, ‘వచ్చార్రోయ్’ పాటలు చార్ట్‌బస్టర్‌ లుగా నిలిచాయి.

ప్రముఖ ఛాయగ్రాహకుడు శామ్‌దత్ అద్భుత కెమెరా పనితనం, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ ప్రతిభ తోడై.. వెండితెరపై భారీ వినోదాన్ని అందించడానికి మ్యాడ్ స్క్వేర్ సిద్ధమైంది.

మ్యాడ్ సినిమాతో థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించిన దర్శకుడు కళ్యాణ్ శంకర్, సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు. ప్రధాన పాత్రలు పోషించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ త్రయం మొదటి భాగానికి మించిన అల్లరి చేయబోతున్నారు.

మ్యాడ్ స్క్వేర్ ను శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఎక్కువ వినోదాన్ని మ్యాడ్ స్క్వేర్ లో చూడబోతున్నారని చిత్ర బృందం తెలిపింది.

భారీ అంచనాల నడుమ 2025, మార్చి 28న థియేటర్లలో అడుగు పెట్టనున్న మ్యాడ్ స్క్వేర్, ఈ వేసవికి ప్రేక్షకులకు మరిచిపోలేని వినోదాన్ని పంచనుంది.

 

 

చిత్రం: మ్యాడ్ స్క్వేర్

విడుదల తేదీ: మార్చి 28, 2025

బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్

 

తారాగణం: సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌, విష్ణు ఓఐ

దర్శకత్వం: కళ్యాణ్ శంకర్

సమర్పణ: సూర్యదేవర నాగ వంశీ

నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

నేపథ్య సంగీతం: తమన్

ఛాయాగ్రహణం: శామ్‌దత్ ISC

కూర్పు: నవీన్ నూలి

ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల

అదనపు స్క్రీన్ ప్లే: ప్రణయ్ రావు తక్కళ్లపల్లి

కళ: పెనుమర్తి ప్రసాద్ M.F.A

ఫైట్ మాస్టర్: కరుణాకర్

పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Latest Articles

దర్శకుల సమక్షంలో ‘ఏఎల్‌సీసీ’ బిగ్ టికెట్ లాంచ్

యెల్ ఆర్ ఫిల్మ్ సర్కూట్స్ బ్యానర్‌పై లేలీధర్ రావు కోలా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏ ఎల్ సి సి’ (ఓ యూనివర్సల్ బ్యాచిలర్). రీసెంట్ గా ఈ సినిమా ట్రెయిలర్ విడుదలై...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్