తిరుపతి జిల్లా నగరి ప్రజలకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని మాజీ మంత్రి రోజా అన్నారు. రోజా తన కుటుంబ సభ్యులు, నగరి ప్రజలు, పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే నగరి ప్రజలు రాజకీయ జన్మనిచ్చారని రోజా చెప్పారు. తనను నగరి ప్రజలు ఎంతగానో ఆదరించారని అన్నారు. నగరి ప్రజలకే తన జీవితం అంకితం అని రోజా వెల్లడించారు. రాజకీయ జీవితంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు మాజీ మంత్రి చెప్పుకున్నారు. అలాంటి సమయాల్లో నగరి ప్రజలతో పాటు తన కుటుంబ సభ్యులు అండగా ఉన్నారని రోజా గుర్తుచేశారు.