ఢిల్లీలో రేవంత్ రెడ్డి. ఎందుకో తెలుసా..?

ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. నిన్న రాత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలసి ఢిల్లీ వెళ్లిన రేవంత్…. పార్టీ హైకమాండ్‌ నేతలను కలవనున్నారు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతోపాటు సోనియా, రాహుల్‌ గాంధీలతో భేటీ కానున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై పార్టీ పెద్దలతో రేవంత్ రెడ్డి బృందం చర్చించనున్నారు. దీంతో పాటు పీసీసీ చీఫ్ నియామకంపై కూడా రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలలో చర్చించనున్నారని సమాచారం.

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టితోపాటు పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ కూడా ఢిల్లీలో ఉన్నారు. త్వరగా పార్టీ చీఫ్ ను రాష్ట్రంలో నియమిస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సులువుగా ఉంటుందని సీఎం రేవంత్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే ఈ పదవిపై కొన్ని పేర్లను హైకమాండ్ పరిశీలనలో ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి పర్యటన ఢిల్లీలో కొనసాగుతుంది. దీంతో పాటు మంత్రి వర్గ విస్తరణ గురించి కూడా ఒక క్లారిటీని పార్టీ పెద్దల నుంచి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

Latest Articles

మీనాక్షి సెంటిమెంట్ మళ్లీ నిజమయ్యేనా..?

ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది.. అదే సినీ జనాలకు అయితే.. ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. మేటర్ ఏంటంటే.. ఇండస్ట్రీలో మీనాక్షి సెంటిమెంట్ ఒకటి ఉంది. దీంతో యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్