రాష్ట్ర విభజన తరువాత పదేళ్ల పాటు గులాబీ పార్టీ అధికారాన్ని చెలాయించింది. దశాబ్దకాలం పాటు ఉనికిని కాపాడుకోవడానికి నానా కష్టాలు పడ్డ కాంగ్రెస్ పార్టీ… రేవంత్ పగ్గాలు చేపట్టడంతో దూకుడు పెంచింది. అదే స్పీడ్‌ని కంటిన్యూ చేస్తూ అధికారాన్ని కూడా చేపట్టింది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తవుతోంది. ఏడాదిలో అందరి అంచనాలకు భిన్నంగా రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ఇంటర్నల్ పాలిటిక్స్‌లో అప్పర్ హ్యాండ్ సాధించారు. పవర్‌లోకి వచ్చిన మొదటి పార్టీతో పాటు, ప్రభుత్వంలో అసమ్మతి తలెత్తకుండా సక్సెస్ అయ్యారు.
కాంగ్రెస్ అంటేనే అంతర్గత కుమ్ములాటలు, ముఠా తగదాలకు కేరాఫ్ అడ్రస్ అనే ప్రచారం ఏండ్ల నుంచి ఉన్నది. కొందరు ఓపెన్‌గా ప్రత్యర్థి లీడర్‌కు వ్యతిరేకంగా ఫైట్ చేస్తే, ఇంకొందరు మాత్రం తమ వ్యూహాలతో పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ ఉద్దండులుగా ముద్రపడ్డ కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలు ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు సొంత పార్టీలోనే అసమ్మతి తలెత్తి ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో సీఎం పదవిపై తీవ్ర పోటీ ఏర్పడింది. పార్టీలో మొదటి నుంచి ఉండి పని చేసిన తమకే ముఖ్యమంత్రి పోస్టు ఇవ్వాలని సీనియర్ లీడర్లు పట్టుబట్టారు. కానీ అప్పటికే పీసీసీ అధ్యక్షుడిగా పని చేస్తున్న రేవంత్‌రెడ్డిని సీఎంగా నియమించేందుకు రాహుల్‌గాంధీ డెసిషన్ తీసుకున్నారు. ఆ సందర్భంలోనే పార్టీలో అసమ్మతి పెరుగుతుందనే ప్రచారం మొదలైంది. సీఎం పదవి దక్కలేదని అక్కసుతో సీనియర్లు ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతారనే డిస్కషన్ సాగింది. కానీ రేవంత్‌రెడ్డి పక్కా ప్లాన్‌తో ముందుకెళ్లడంతో అసమ్మతి, అసంతృప్తి జ్వాలలు కనిపించలేదు.
సీఎంగా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తనకంటూ ఓ లక్ష్మణ రేఖ గీసుకున్నారని, దాన్ని దాటక పోవడంవల్లే ఎక్కడా అసమ్మతి, అసంతృప్తి తలెత్తలేదనే ప్రచారం ఉన్నది. దీనికి తోడు మంత్రులకు పూర్తి స్వే్చ్ఛ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో సీఎంకు వ్యతిరేకంగా బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లు చేసే విమర్శలను ఖండించేందుకు మిగతా మంత్రులెవ్వరూ ముందుకు రాలేదు. తమను విమర్శించలేదు కదా? అనేలా ఉండేవారనే ప్రచారం ఉంది. క్రమంగా రేవంత్‌కు మంత్రులు అండగా నిలవడం మొదలైంది. ఇప్పుడు సీఎం రేవంత్‌పై ప్రతిపక్షాలు చిన్న విమర్శ చేసినా… మంత్రులు వెంటనే రియాక్ట్ అవుతున్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైడ్రా, మూసీ పునరుజ్జీవంలాంటి ప్రాజెక్టుల విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా.. రేవంత్ తగ్గేదేలే అంటున్నారు. అదే స్థాయిలో మంత్రులు కూడా ముఖ్యమంత్రిగా అండగా నిలుస్తున్నారు. మొత్తంగా రేవంత్ ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెతను నూటికి నూరుశాతం ఇంప్లిమెంట్ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.