కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణ తల్లి నెత్తిన కిరీటం మాయం.. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయం.. తెలంగాణ రైతుల భూములు మాయం అంటూ ట్వీట్ చేశారు. టీఎస్‌లో ఎస్ మాయం.. ఖజానాలో కాసులు మాయం… మాయం చేయడం.. మోసం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం నైజమని విమర్శించారు. ప్రజలకు చేసిందేమిటీ.. ప్రజలకు ఒరిగిందేమిటీ..జాగో తెలంగాణ అంటూ ట్వీట్ చేశారు.