స్వతంత్ర వెబ్ డెస్క్: రాహుల్ తిరిగి ఎంపీగా పార్లమెంట్ లో అడగు పెట్టడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఖుషి అవుతున్నారు. అహ్మదాబాద్ హైకోర్టు అనర్హతపై.. సుప్రీంకోర్టు స్టే విధించటంతో.. రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎంపీ పదవిని తిరిగి పునరుద్దరిస్తూ.. లోక్ సభ స్పీకర్ (Speaker)) నిర్ణయం తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. పార్లమెంట్ లో కాంగ్రెస్(Congress)) పార్టీలు స్వీట్లు పంచుకున్నారు. పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే (Mallikharjuna Kharge) అయితే అందరికీ స్వీట్లు పంచారు. విషయం తెలిసిన వెంటనే.. స్పీకర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే.. రాహుల్ గాంధీ పార్లమెంట్ కు చేరుకున్నారు.
రాహుల్‌గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించినట్లు స్పీకర్ కార్యాలయం ఆగస్టు 7న నోటిఫికేషన్ విడుదల చేసింది. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు విధించిన రెండేండ్ల జైలు శిక్ష అమలుపై ఇటీవల సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసులో రాహుల్‌కు గరిష్ట శిక్ష విధించేందుకు ట్రయల్ జడ్జి ఎలాంటి కారణాలు చెప్పలేదని వ్యాఖ్యానించింది. దీంతో రాహుల్‌ను దోషిగా నిర్ధారించే తీర్పును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.