అన్ని దార్లు మహాకుంభమేళాకే అన్నట్లు.. విపరీతమైన రద్దీ కొనసాగుతోంది. మహాకుంభమేళా ముగింపు దశకు చేరుకోవడంతో ప్రభుత్వ అంచనాకు మించి భక్తులు తరలివస్తున్నారు. ఈనెల 26న మహాశివరాత్రితో మహాకుంభమేళా ముగియబోతుంది. దీంతో భక్తులు పోటెత్తుతున్నారు.
ఇలా భక్తుల రద్దీ కొనసాగుతుండడం.. ఇంకా రద్దీ పెరుగుతుండంతో ప్రయాగ్‌రాజ్ వాసులకు ఇబ్బందులు ఎదురువుతున్నాయి. దీంతో దయచేసి ప్రయాగ్ రాజ్ రావొద్దు.. అని భక్తులను వేడుకుంటున్నారు. తమ దైనందిన జీవితానికి అంతరాయం కలుగుతుందని.. నగరానికి రావొద్దని బహిరంగంగా వేడుకుంటూ పోస్టులు పెడుతున్నారు.
ప్రయాగ్ రాజ్ నివాసి.. రెడ్డిట్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ప్రయాగ్ రాజ్ అధికారికంగా దాని బ్రేకింగ్ పాయింట్ చేరుకుంది.. పర్యాటకుల సంఖ్య ఇంకా పెరుగుతుండడంతో స్థానికులు తమ దైనందిన జీవితాన్ని గడపడం కష్టతరంగా మారిందని అంటున్నారు.
మహాకుంభ నగర సమగ్ర నిర్మాణంలో భాగంగా కొత్త రోడ్లు, ఫ్లైఓవర్లు , మెరుగైన ట్రాఫిక్ నియంత్రణతో నగరం గత సంవత్సరంతో పోలిస్తే ఎలా మారిపోయిందో యూజర్ వివరించాడు. కానీ ఇప్పుడు, ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఉన్న థ్రిల్.. పూర్తిగా తమకు ఇబ్బందిగా మారిందని అన్నారు.
“ఇవాళ ఫిబ్రవరి 19. చివరి అమృత స్నానం పూర్తయింది. మహకుంభమేళా దాదాపు చివరి దశకు వచ్చేశాము. ఎందుకు రద్దీ తగ్గడానికి బదులుగా ఇంకా పెరుగుతూ వస్తోంది?”…. అని రాశారు.
యూజర్.. నగరంలో అధ్వాన్నంగా ఉన్న పరిస్థితిని వివరించారు. రోడ్లు ఇరుకుగా మారాయని, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్స్‌లో రద్దీ పెరిగిందని.. చిన్న చిన్న సందులు కూడా జనం, కార్లతో నిండిపోయి స్థానికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని అన్నాడు.
యూజర్.. నగరంలో తనకు ఎదురైన అనుభవాన్ని పోస్ట్‌లో పంచుకున్నాడు. నగరంలో తిరుగుదామని తన వాహనాన్ని బయటకు తీసి వెళ్తే.. గుర్తు తెలియని వ్యక్తులు తనను ఆపారని.. తన వల్లే ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని… తనపై అరిచారంటూ తన ఆవేదనను రాసుకొచ్చాడు. కానీ తాము అక్కడే నివసించే వాళ్లం.. తమపై అరవడమేంటి..?
చివరగా యూజర్ తన పోస్టులో దేశ ప్రజలను అభ్యర్థిస్తూ… భక్తులు తమ ప్రయాగ్‌రాజ్ పర్యటనను రద్దు చేసుకోవాలని కోరాడు. ” గంగా సగమం ఎక్కడికీ వెళ్లదు.. మీరు తీరుబడిగా తర్వాత వచ్చి పుణ్యస్నానాలు చేసుకోవచ్చు. దయచేసి ఈ నగరం.. నగరంలోని ప్రజల మీద దయ ఉంచండి.. మిమ్మల్ని వేడుకుంటున్నాము..” అని రాశాడు.
ఆ పోస్ట్‌లో పాదచారుల గురించి మాట్లాడుతూ.. ఎటువంటి మర్యాదలు లేకుండా ఉమ్మివేస్తున్నారని, చెత్త వేస్తున్నారని అన్నాడు. వాహనాలతో నరకంగా ఉన్న ట్రాఫిక్‌ను మరింత దిగజార్చాయని పేర్కొన్నాడు.
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. ఫిబ్రవరి 26న ముగియనుంది.