ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ నిరాహార దీక్ష ఇప్పుడు చర్చనీయాంశమైంది. బీపీఎస్సీలో పేపర్ లీక్‌ను నిరసిస్తూ ఉద్యోగార్థులకు మద్దతుగా పట్నాలోని గాంధీ మైదానంలో నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే అక్కడ నిలిపి ఉంచిన ఆయన లగ్జరీ వ్యాన్ గురించి పలు రకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఆన్‌లైన్‌లో పోస్టులు పెడుతున్నారు. అది ఏసీ, కిచెన్, బెడ్రూం సౌకర్యాలతో కూడిన వ్యాన్ కావడంతో వివాదం రేగింది. ఉద్యోగుల భవిష్యత్తును పట్టించుకోకుండా అనవసరంగా వ్యాన్ గురించి వివాదం సృష్టిస్తున్నారని జన్ సురాజ్ పార్టీ అధికార ప్రతినిధి వివేక్ మండిపడ్డారు.