కాసేపట్లో నాంపల్లి కోర్టుకు అల్లు అల్లున్ రానున్నారు. మధ్యాహ్నం లోపు ఆయన నాంపల్లి కోర్టుకు చేరుకుంటారు. బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు పత్రాలు సమర్పించనున్నారు. శనివారం కావడంతో లంచ్ సమయం లోపలే కోర్టుకు వెళ్లనున్నారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ వస్తున్న నేపథ్యంలో నాంపల్లి కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
డిసెంబర్ 4న సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో హీరో అల్లు అర్జున్‌కి శుక్రవారం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్‌పై గత నెల 30న వాదనలు పూర్తయ్యయి. శుక్రవారం ఈ పిటిషన్‌పై నాంపల్లి రెండో మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు తీర్పును వెల్లడించింది. ఈ కేసులో ఏ11గా అల్లు అర్జున్ ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన మద్యంతర బెయిల్‌పై ఉన్నారు. తాజాగా నాంపల్లి కోర్టు షరుతులతో కూడిన సాధారణ బెయిల్ ఇచ్చింది. హత్యకు, హత్యకు సంబంధించి అల్లు అర్జున్ పై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు వర్తించవంటూ తాము చేసిన వాదనలతో న్యాయస్థానం ఏకీభించిందని అందుకే బెయిల్ మంజూరు చేసిందని అల్లు అర్జున్ తరపు న్యాయవాది తెలిపారు.
మరోవైపు ఇప్పటికే పుష్ప 2 నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సంధ్య థియేటర్ తొక్కసలాట ఘటనలో నిర్మాతలపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్‌పై విచారణ జరిపింది హైకోర్టు. నిర్మాతలు రవిశంకర్, నవీన్‌ను అరెస్టు చేయొద్దని.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.
పుష్ప 2 రిలీజ్ డే రోజున సంథ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవంత్ అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.