1..ఆల్కహాల్ సీసాల మీద హెచ్చరికలు ఉండాలంటున్న అమెరికన్ సర్జన్
2..ఆల్కహాల్ వినియోగం వల్ల ఏడు రకాల క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం
3..యూరోపియన్, యు.ఎస్-లిస్టెడ్ డ్రింక్స్ తయారీదారుల షేర్లు పడిపోయాయి
4..సర్జన్ జనరల్ సూచనలు ఆమోదిస్తారో… లేదో
ఆల్కహాల్ డ్రింక్స్‌పై క్యాన్సర్ హెచ్చరికలు ఉండాలని అమెరికన్ సర్జన్ జనరల్ కోరారు. శుక్రవారం ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఆల్కహాల్ సేవించడం వల్ల ఏడు రకాల క్యాన్సర్ల బారిన పడే అవకాశం ఉందని U.S. సర్జన్ వివేక్ మూర్తి హెచ్చరించారు. ఆల్కహాల్ వినియోగం అనేది క్యాన్సర్‌కు మూడవ ప్రధాన కారణమని కూడా ఆయన వివరించారు. వివేక్ మూర్తి హెచ్చరికలతో యూరోపియన్, యు.ఎస్-లిస్టెడ్ డ్రింక్స్ తయారీదారుల షేర్లు పడిపోయాయి.
U.S. సర్జన్ జనరల్ వివేక్ మూర్తి మాట్లాడుతూ,.. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రొమ్ము, పెద్దప్రేగు, కాలేయ క్యాన్సర్‌తో సహా కనీసం ఏడు రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు, అయితే చాలా మంది అమెరికాలోని వినియోగదారులకు దీని గురించి తెలియదని అన్నారు.
ఆల్కహాల్ వినియోగ పరిమితులపై మరోసారి పరిశీలించాలని చెప్పారు. తద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని అంచనా వేసుకుని ప్రజలు ఎంత తాగాలో నిర్ణయించుకుంటారని సూచించారు. U.S. ఆహార మార్గదర్శకాల ప్రకారం.. ప్రస్తుతం పురుషులకు రోజుకు రెండు లేదా అంతకంటే తక్కువ డ్రింక్స్.. మహిళలకు రోజుకు ఒకటి లేదా అంతకంటే తక్కువని సిఫార్సు చేస్తున్నాయి.
యునైటెడ్ స్టేట్స్‌లో పొగాకు, స్థూలకాయం తర్వాత, ఆల్కహాల్ వినియోగం అనేది క్యాన్సర్‌కు మూడవ ప్రధాన కారణమని వివేక్ మూర్తి కార్యాలయం కొత్త నివేదికలో తెలిపింది. అయితే ఏ రకమైన మద్యం సేవించామనేదానితో సంబంధం లేదన్నారు.
సర్జన్ వివేక్ మూర్తి సూచనలతో అమెరికాలోని ఆల్కహల్ కంపెనీల షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. యూరోపియన్, యు.ఎస్-లిస్టెడ్ డ్రింక్స్ తయారీదారుల షేర్లు పడిపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది.
అగ్రశ్రేణి స్పిరిట్స్ తయారీదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించిన డిస్టిల్డ్ స్పిరిట్స్ కౌన్సిల్ (డిస్కస్) ఒక కొత్త నివేదికను సూచించింది, ఆల్కహాల్‌ను మితంగా తాగడం వల్ల మరణాల రేటు తక్కువగా ఉంటుందని… నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇంజినీరింగ్ మరియు మెడిసిన్ అంటోంది. అలాగే రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెప్పింది.