యాదగిరి గుట్ట మండలంలోని పెద్దకందుకూరులో ఓ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ప్రీమియర్ ఎక్స్‌క్లూజివ్ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా,, ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు సంభవించడంతో కార్మికులు పరుగులు తీశారు.
ఈ ఘటనలో కనకయ్య అనే కార్మికుడు మృతి చెందాడు. జనగామ జిల్లా బచ్చన్నపేట ఆయన సొంత గ్రామం. యాదగిరి గుట్ట మండలం రామాజీ పేట గ్రామానికి చెందిన మొగిలిపాక ప్రకాశ్ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో అతనిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
అగ్ని ప్రమాదం జరగ్గానే.. యాజమాన్యం ఎమర్జెన్సీ సైరన్‌తో కార్మికులను అలర్ట్ చేసింది. గాయపడిన పలువురు కార్మికులను హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.