యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న భారీ, క్రేజీ మూవీ డ్రాగన్. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం తారక్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఈ పాన్ ఇండియా మూవీ నుంచి వచ్చే ఫస్ట్ గ్లింప్స్ కోసం డేట్ లాక్ చేసారని న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు టైమ్ కూడా ఫిక్స్ చేసారని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాకుండా.. గ్లింప్స్ రన్ టైమ్ కూడా ఫైనల్ అయ్యిందని టాక్.. ఇదిలా ఉంటే.. డ్రాగన్ ఫ్యాన్స్ కి నిద్ర లేకుండా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుండడం ఆసక్తిగా మారింది. ఇంతకీ.. డ్రాగన్ గ్లింప్స్ ఎప్పుడు..? ఎలా ఉండబోతోంది..?
మే నెల వస్తుందంటే.. ఎప్పుడెప్పుడు మే 20 వస్తుందా అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే.. ఎన్టీఆర్ జన్మదినం. ఆ రోజున ఎన్టీఆర్ ప్రతి సంవత్సరం కొత్త సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ ఇస్తుంటారు. అందుచేత ఈ ఇయర్ కూడా తమ అభిమాన హీరో కొత్త సినిమాకి సంబంధించిన అప్ డేట్ వస్తుందని ఫ్యాన్స్ వెయిటింగ్. ఈసారి డ్రాగన్ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లోనే హయ్యాస్ట్ బడ్జెట్ తో రూపొందుతోన్న సినిమా ఇది. పైగా కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ చిత్రాలు తెరకెక్కంచిన ప్రశాంత్ నీల్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండడంతో ఎన్టీఆర్ ను మాస్ గా చూపిస్తాడని గట్టి నమ్మకంతో ఉన్నారు అభిమానులు.
ఇదిలా ఉంటే.. ఈ మూవీ గ్లింప్స్ ను ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 19న అర్థరాత్రి రిలీజ్ చేయాలని ముహుర్తం ఫిక్స్ చేసారట. ఎన్టీఆర్ లక్కీ నెంబర్ 9. అందుచేత అర్థరాత్రి 12 గంటల 6 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇదే కనుక నిజమైతే.. ఆ రోజు రాత్రంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నిద్ర ఉండదు అన్నమాట. ఇక ఈ గ్లింప్స్ అయితే.. అంచనాలకు మించి ఉంటుందని.. భారీ లెవెల్లో.. యాక్షన్-ఎలివేషన్లతో ఈ గ్లింప్స్ వేరే లెవల్లో ఉండేలా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసారని టాక్ బలంగా వినిపిస్తోంది.
ఇక గ్లింప్స్ రన్ టైమ్ విషయానికి వస్తే.. దాదాపుగా మూడు నిమిషాలు ఉండేలా ప్లాన్ చేసారట. ఇందులో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్.. రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది అనేలా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. జూన్ 4న విడుదల కానున్న రామ్ చరణ్ పెద్ది సినిమాని ప్రదర్శించే అన్ని థియేటర్లలో డ్రాగన్ గ్లింప్స్‌ను కూడా స్క్రీనింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇది మెగా-నందమూరి అభిమానులకు డబుల్ ట్రీట్ అని చెప్పవచ్చు. మొత్తానికి డ్రాగన్ గ్లింప్స్ పక్కా ప్లానింగ్ తో వస్తున్నాడు. మరి.. డ్రాగన్ గ్లింప్స్ తో యంగ్ టైగర్ ఏ రేంజ్లో సౌండ్ చేస్తాడో చూడాలి.


