గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ నుంచి రెండు పాటలు రిలీజ్ చేశారు. అలాగే గ్లింప్స్ రిలీజ్ చేశారు. అయితే.. అసలు పెద్ది కథ ఏంటి అనేది మాత్రం ఇంత వరుకు రివీల్ చేయలేదు. పెద్ది అనగానే.. ఇది స్పోర్ట్స్ డ్రామా.. ఇంకా చెప్పాలంటే.. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే సినిమానే అనుకుంటారు. అయితే.. ఇప్పుడు పెద్ది కథ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. దీనిని బట్టి అంతకు మించి అనేలా ఉండబోతుందని తెలుస్తుంది. ఇంతకీ.. ప్రచారంలో ఉన్న పెద్ది కథ ఏంటి..?
పెద్ది గురించి ప్రచారంలో ఉన్న కథ ఏంటంటే.. ఇది ఊరికి సంబంధించిన ఎమోషనల్ స్టోరీ అట. నాయకులు, ప్రభుత్వాలు.. నిర్ణక్ష్యం చేసిన ఊరి కోసం హీరో ఏం చేసాడు..? జనాల్లో ఎలాంటి మార్పు తీసుకువచ్చాడు..? అనేది చాలా ఆసక్తిగా ఉత్కంఠతో చూసేలా తెర పై చూపించబోతున్నాడట డైరెక్టర్ బుచ్చిబాబు. ఇందులో క్రికెటర్ గా రామ్ చరణ్ నటిస్తుంటే.. కోచ్ గా కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, హీరో తండ్రిగా జగపతి బాబు నటించారట. జగపతి, శివ రాజ్ కుమార్ పాత్రలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయని సమాచారం. అలాగే చరణ్ కు జంటగా నటించిన జాన్వీ కపూర్ పాత్రకు కూడా కథలో ప్రాముఖ్యత ఉంటుందట. ఈ నెల 18న రిలీజ్ చేయనున్న ట్రైలర్ లో పెద్ది కథకు సంబంధించి క్లూ ఇవ్వనున్నారని.. అలాగే క్లైమాక్స్ లో.. చరణ్ యాక్టింగ్ వేరే లెవల్లో ఉంటుందని సమాచారం.
ఇప్పటి వరుకు పెద్ది సినిమా నుంచి రెండు పాటలను రిలీజ్ చేశారు. ఈ రెండు పాటలు.. విన్న వెంటనే జనాలకు విపరీతంగా నచ్చేసాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక గ్లింప్స్ అయితే.. పాన్ ఇండియా రేంజ్ లో సోషల్ మీడియాని షేక్ చేశాయి. సంగీత సంచలనం ఏఆర్ రెహ్మాన్ ఈమధ్య కాలంలో ఫామ్ లో లేరు. అందుచేత ఎలాంటి మ్యూజిక్ అందిస్తారో.. రీ రికార్డింగ్ ఎలా ఉంటుందో అనే అనుమానులు ఉండేవి. అయితే.. పెద్ది నుంచి రిలీజ్ చేసిన రెండు పాటలకు.. అలాగే గ్లింప్స్ కు అదిరిపోయే మ్యూజిక్ అందించారు. దీంతో రెహ్మాన్ మ్యూజిక్ పై ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి. త్వరలో మూడో పాటను రిలీజ్ చేయనున్నారు.
గేమ్ ఛేంజర్ మూవీ డిజాస్టర్ అవ్వడంతో.. పెద్ది సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక బుచ్చిబాబు అయితే.. ఈ మూవీ కోసం తపస్సు చేసినట్టుగా కష్టపడ్డాడు. ట్రైలర్ ను ముంబాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో చరణ్ కుస్తీ ఫైట్ కు సంబంధించిన విజువల్స్ చూపించారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. జూన్ 4న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. మరి.. పెద్ది ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో సౌండ్ చేస్తాడో.. ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి.


