ఆది శంబాల మ్యాజిక్ రిపీట్ అయ్యేనా..?

ఆది సాయికుమార్.. ఒకప్పుడు ప్రేమకథా చిత్రాలతో యూత్ ని ఆకట్టుకున్నాడు. అయితే.. ఆతర్వాత సరైన కథలు ఎంచుకోకపోవడం వలన సక్సెస్ కి దూరమయ్యాడు. పట్టువదలని విక్రమార్కుడులా ప్రయత్నించిన ఆది సాయికుమార్.. ఎట్టకేలకు శంబాల మూవీతో విజయం సాధించి ఫామ్లోకి వచ్చాడు. రీసెంట్ గా కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు. మరి.. ఆది కొత్త సినిమా ఎలా ఉండబోతుంది..? మరోసారి శంబాల మ్యాజిక్ ని రిపీట్ చేయడం సాధ్యమేనా..?

ప్రేమకావాలి సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఆది సాయికుమార్.. తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించి యూత్ కి దగ్గరయ్యాడు. ఆతర్వాత లవ్ లీ, సుకుమారుడు, చుట్టలబ్బాయి, శమంతకమణి తదితర చిత్రాలతో ఆకట్టుకున్నాడు. అయితే.. సరైన కథలు ఎంచుకోకపోవడం వలన కెరీర్లో బాగా వెనకబడ్డాడు. నెక్ట్స్ నువ్వే, బుర్రకథ, జోడి, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, శశి, అతిధిదేవోభవ, బ్లాక్, తీస్ మార్ ఖాన్.. ఇలా ఓ డజను సినిమాలు చేసినా ఒక్కటంటే ఒక్కటి కూడా సక్సెస్ సాధించలేదు. అయినా.. ఆది ప్రయత్నం చేయడం మాత్రం ఆపలేదు. ఎట్టకేలకు శంబాల అనే హర్రర్ థ్రిల్లర్ తో సక్సెస్ సాధించాడు.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో, అదే సక్సెస్ ఫుల్ టీమ్ తో ఆది తన తదుపరి సినిమాను ప్రకటించాడు. తన కొత్త సినిమా గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. శంబాల వంటి హిట్ చిత్రాన్ని అందించిన క్రేజీ టీమ్ తో మళ్ళీ వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉందని.. ఈసారి మేము పూర్తిగా సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నాం అని రాసుకొచ్చాడు.

కొత్త చిత్రం గురించి ఆది ఏం చెప్పాడంటే… కొన్ని కథలు తలుపు తట్టి రావు, అవి నిశ్శబ్దంగా వికసించి మనల్ని వెంటాడుతుంటాయని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అందం, రక్తం, చీకటితో నిండిన ఒక విభిన్నమైన అనుభూతిని ఈ సినిమా ప్రేక్షకులకు అందిస్తుందని చెప్పాడు. అయితే.. హిట్ కాంబినేషన్స్ ను రిపీట్ చేస్తుంటారు. ఆది సాయికుమార్ కూడా అదే చేస్తున్నాడు. శంబాల డైరెక్టర్ యుగంధర్ ఈ కొత్త సినిమాకి ప్రజెంటర్. బృందా రవీందర్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి.. ఆది.. ఈ సినిమాతో ఆది శంబాల మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడేమో చూడాలి.

Latest Articles

ప్రభాస్.. షాకింగ్ అనౌన్స్ మెంట్..

బాహుబలి మూవీ ఓ చరిత్ర. ఒక కథను రెండు భాగాలుగా చెప్పచ్చు.. అలా చెప్పడం ద్వారా బ్లాక్ బస్టర్ సాధించవచ్చు.. అని నిరూపించింది దీంతో సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది. స్టార్ హీరోలే కాదు.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్