ములుగు జిల్లా మల్లంపల్లి బ్రిడ్జ్ ప్రమాదస్థితికి చేరకుంది. నిర్మాణం పూర్తికాకముందే మల్లంపల్లి బ్రిడ్జి కుంగిపోయే స్థితిలో ఉంది. మొదటి వర్షానికే బ్రిడ్జి అంచున పోసిన మట్టి కొట్టుకుపోయింది. మేడారం జాతర ముందు మొదలుపెట్టిన పని ఇప్పటి వరకు పూర్తికాలేదు. బ్రిడ్జిని కాంట్రాక్టర్ నాణ్యత లోపంతో నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జాతీయ రహదారి కావడంతో రోజుకు వేల సంఖ్యలో వాహనాలు లోడుతో వెళ్తుంటాయి. ఈ క్రమంలో ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు. ప్రమాదం జరగకముందే ప్రభుత్వం స్పందించి.. బ్రిడ్జి నాణ్యతతో నిర్మించి సకాలంలో పూర్తి చేయాలని వాహనదారులు, ప్రయాణికులు, స్థానికులు కోరతున్నారు.
ప్రమాదకరంగా నూతనంగా నిర్మిస్తున్న మల్లంపల్లి బ్రిడ్జి
0
94
Previous article
Latest Articles
210 కిలోల నందిని పాలపొడి పట్టివేత!
కర్ణాటక ప్రభుత్వం చిన్నారుల కోసం అమలు చేస్తున్న ఉచిత పాల పథకానికి చెందిన నందిని పాలపొడి అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలోని ఆలేరు వద్ద ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో 210 కిలోల...
- Advertisement -
- Advertisement -


