అమరావతిలో ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ కొత్త సినిమా పూజా కార్యక్రమం నిర్వహించారు. బాలకృష్ణ 112 సినిమాకు మంత్రి లోకేష్ క్లాప్ కొట్టారు. బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవానికి అతిథులుగా మంత్రులు లోకేష్, కందుల దుర్గేష్ హాజరయ్యారు. ఈ మూవీ బడ్జెట్ రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది. ఎక్కువ శాతం ఇక్కడే మూవీ షూటింగ్ చేస్తారని కందుల దుర్గేష్ తెలిపారు. స్టూడియోలు, రికార్డిండ్ థియేటర్లకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌తో పాటు..కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. బాలకృష్ణ నాయకత్వంలో సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాలు, అధునాతన సాంకేతికతతో..ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్‌లో అమరావతి మంచి సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుందని మంత్రి లోకేశ్ అన్నారు.
అమరావతిలో బాలకృష్ణ కొత్త సినిమా పూజా కార్యక్రమం.. క్లాప్ కొట్టిన లోకేశ్
0
74
Latest Articles
210 కిలోల నందిని పాలపొడి పట్టివేత!
కర్ణాటక ప్రభుత్వం చిన్నారుల కోసం అమలు చేస్తున్న ఉచిత పాల పథకానికి చెందిన నందిని పాలపొడి అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలోని ఆలేరు వద్ద ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో 210 కిలోల...
- Advertisement -
- Advertisement -


