సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్

శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా “సర్కారు బాయి”. ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు లారా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అప్పటి తెలంగాణ సమాజాన్ని ప్రతిబింబిస్తూ నీటి సమస్యలు, కుల వివక్ష, అణగారిన వర్గాల జీవిత పోరాటం వంటి అంశాలను దర్శకుడు లారా కళ్లకు కట్టినట్లు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ రోజు హీరో శ్రీరామ్ నిమ్మల పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ.. మూవీ టీమ్ బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో తెలంగాణ పల్లె యువకుడిగా ఎంతో సహజంగా శ్రీరామ్ నిమ్మల కనిపిస్తున్నారు. “సర్కారు బాయి” సినిమా హీరోగా, నటుడిగా ఆయనకు మంచి పేరు తెస్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం “సర్కారు బాయి” సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నెల 17వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

చేగుంట సమీపంలోని రెడ్డిపల్లి అనే ఊరిలో “సర్కారు బాయి” చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ లెంగ్తీ షెడ్యూల్ లో సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా హై క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. హీరో శ్రీరామ్ నిమ్మల, హీరోయిన్ వర్షిక, ముఖ్య నటీనటులు బాహుబలి ప్రభాకర్, నాగ మహేష్ లపై సీన్స్ షూటింగ్ చేస్తున్నారు. జూలై నెలాఖరు వరకు ఈ భారీ షెడ్యూల్ కొనసాగనుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.

Latest Articles

టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌కు జ్యోతిష్య గండం.!

టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌కు జ్యోతిష్య గండం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వరుస వివాదాలతో మహేష్ గౌడ్‌పై అధిష్టానం సీరియస్‌గా ఉంది. కీలక పదవులు దక్కినా సవాళ్లు మాత్రం తప్పట్లేదు. కాంగ్రెస్‌లో అంతర్గత...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్