స్వతంత్ర న్యూస్‌ చానెల్ 4వ వార్షికోత్సవం..హాజరైన అతిరథమహారథులు

స్వతంత్ర న్యూస్‌ చానెల్ 4వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. నాలుగేళ్ల కిందట జూన్‌ 26న స్వతంత్ర టీవీ ప్రస్థానం ప్రారంభమైంది. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని బేగంపేట్‌ ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ క్లబ్‌లో వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో రాజకీయ, సినిమా, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వతంత్ర ఛానెల్‌ ఎండీ కృష్ణప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌, తెలంగాణ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌ బండా ప్రకాశ్‌ ముదిరాజ్‌,మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్,మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, కేంద్ర మాజీ మంత్రి జె.డి.శీలం, ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు, సీపీఎం నాయకులు డీ.జి.నర్సింగరావు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ, తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సినీ నటుడు ప్రదీప్‌, తదితరులు హాజరయ్యారు. ఛానెల్‌ సీఈవో సుధాకర్‌, సంస్థ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.  నిఖార్సుగా, నిష్పక్షపాతంగా సామాన్యుడి స్వరమై వార్తలను ప్రసారం చేస్తున్న స్వతంత్ర ఛానెల్‌ను ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. ఎవరి పక్షాన నిలవకుండా, ఏ పార్టీకి కొమ్ముకాయకుండా కేవలం వార్తలను వార్తలుగానే, నిజాన్ని నిర్భయంగా ప్రసారం చేస్తున్న స్వతంత్ర ఛానెల్‌ ప్రస్థానాన్ని ప్రశంసించారు. జర్నలిజం అర్ధమే మారిపోయిన ప్రస్తుత కాలంలో రాజకీయ పార్టీలకు కొమ్ముకాస్తున్న కొన్ని ఛానెల్స్‌కు ధీటుగా నిలబడి నిరంతరం ప్రజలకు చేరువగా ఉంటున్న స్వతంత్ర ఛానెల్‌ను ప్రోత్సహించాలని చెప్పారు. ఈ సందర్భంగా ఎండీ కృష్ణ ప్రసాద్‌పై ప్రశంసలు కురిపించారు. నాలుగు వసంతాలు పూర్తి చేసుకొని ఐదో వసంతంలోకి అడుగుపెడుతున్న స్వతంత్ర ఛానెల్‌ ఇదేవిధంగా సామాన్యుడి స్వరమై ప్రజల పక్షాన కొనసాగించాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.

Latest Articles

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

         ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా  తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్‌ చేసి దాడికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్