తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్( Vijay) కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రికి ప్రత్యేక విధుల అధికారి (OSD)గా నియమించిన రికీ రాధాన్ పండిట్ వెట్రివేల్ నియామకాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల వెట్రివేల్‌ను రాజకీయ OSDగా నియమించడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. నియామక ప్రక్రియ, ఆయన పాత్రపై అనేక ప్రశ్నలు లేవనెత్తడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
విపక్షాల నుంచి వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో అసెంబ్లీలో మాట్లాడిన విజయ్ కూడా ఈ నియామకంపై వచ్చిన అభ్యంతరాలను పునఃసమీక్షిస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ హామీ మేరకు నియామకాన్ని రద్దు చేస్తూ చర్యలు తీసుకున్నారు.
తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వ ఏర్పాటైన కొద్ది రోజులకే కీలక నియామకంపై వెనక్కి తగ్గడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.


