కేరళలోని తిరువనంతపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (CMRL) కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇంటిలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టరు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి విజయన్ మద్దతు దారులు ఆయన ఇంటి దగ్గర ఆందోళన చేపట్టారు. ఈడీ బృందం వాహనంపై సీపీఐ(ఎం) కార్యకర్తలు దాడి చేయడంతో హింస చెలరేగింది. తిరువనంతపురంలోని విజయన్ ఇంటి నుంచి ఈడీ బృందం బయటకు వచ్చిన తర్వాత, అధికారుల వాహనంపై సీపీఐ(ఎం) కార్యకర్తలు రాళ్లు రువ్వారు. కారు అద్దాలు పగులగొట్టారు. విజయన్ నివాసం బయట పార్టీ కార్యకర్తలు గుమిగూడి కేంద్ర దర్యాప్తు సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను నియంత్రించి, ఉద్రిక్తత పెరగకుండా నిరోధించేందుకు పోలీసు సిబ్బందిని మోహరించారు. ఈ దాడిలో ఓ పోలీసులు గాయపడ్డాడు.
విజయన్ ఇంటి దగ్గర ఉద్రిక్తత…ఈడీ అధికారుల కారుపై దాడి
0
111
Previous article
Next article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


