హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్లమెంట్ సమీక్ష రసాభాసగా మారింది. నాంపల్లి, కార్వాన్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ ఏర్పడింది. నేతలు ఉస్మాన్ హజరీ, ఫిరోజ్‌ఖాన్ చొక్కాలు పట్టుకున్నారు. ప్రోటోకాల్ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అజారుద్దీన్ పక్కన కూర్చొనే విషయంలో ఇదంతా జరిగినట్టు తెలుస్తోంది. ఉస్మాన్ హజారీ.. ఫిరోజ్‌ఖాన్ చెంపపై కొట్టారు. ఇక ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఫిరోజ్‌ఖాన్ కిందపడిపోయారు. ఇదే సమయంలో ఇద్దరినీ అడ్డుకునే ప్రయత్నం చేశారు వీహెచ్. వీహెచ్‌ను కూడా తోసేసే ప్రయత్నం చేయడంతో అక్కడున్న నేతలు అడ్డుకున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ సమక్షంలోనే ఇదంతా జరిగింది.
గాంధీభవన్‌లో పార్లమెంట్ సమీక్ష రసాభాస.. ఫిరోజ్‌ఖాన్ చెంపపై కొట్టిన ఉస్మాన్ హజారీ
0
38
Previous article
Latest Articles
జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్ తగిలింది. సీఐడీ సమర్పించిన చార్జిషీట్‌లో దిమ్మతిరిగే వాస్తవాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్‌మెయిలర్ అని సీఐడీ తేల్చింది. విజయవాడ...
- Advertisement -
- Advertisement -


