నేడు రాజమహేంద్రవరంలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
మెగాస్టార్ చిరంజీవి ఈవెంట్‌కు వస్తారని ప్రచారం
నేడు రాజమహేంద్రవరంలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. దీంతో మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహం నెలకొంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుకకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకాబోతున్నారు. దీంతో ఫ్యాన్స్ మరింత సంతోషంగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈవెంట్‌కు వస్తారని ప్రచారం జరుగుతోంది. మెగా కుటుంబం అంతా ఒకే వేదికపై కనిపిస్తుందనే జోష్ లో అభిమానులు ఉన్నారు.
వేమగిరి జాతీయ రహదారి పక్కన లేఔట్ లో సా. 6 గం.ల నుంచి మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. సుమారు లక్ష మంది అభిమానులు తరలివస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా రాజకీయ, సినీ ప్రముఖులు రానున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యరు. వేయి మందిపైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కోల్ కత్తా – చెన్నై జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. భారీ వాహనాలు గోదావరి నాలుగో వంతెన మీదుగా దారి మళ్లిస్తున్నారు. హైదరాబాద్‌లో సంథ్య తరహా ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అభిమానులు జాగ్రత్తలు పాటించి సురక్షితంగా ఉండాలని పోలీసుల సూచనలు చేశారు.
గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటించగా. .. కియరా అద్వానీ హీరోయిన్‌గా కనిపించబోతుంది. ప్రముఖ డైరెక్టర్ శంకర్ దీనికి దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.