23.2 C
Hyderabad
Saturday, January 18, 2025
spot_img

విడిపోయారనే పుకార్లు.. న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌ తర్వాత ముంబై చేరుకున్న అభిషేక్‌, ఐశ్యర్య

న్యూ ఇయర్‌ వేడుకలు కలిసి జరుపుకున్న బచ్చన్ కుటుంబం ముంబైకి తిరిగి వచ్చింది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, వారి కుమార్తె ఆరాధ్యతో విమానాశ్రయంలో కనిపించారు. ముగ్గురూ కూడ ఎయిర్‌పోర్టులో సాధారణ డ్రెస్సుల్లో కనిపించారు.

ఈ వైరల్‌ వీడియోలో .. ముందు అభిషేక్‌ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్నాడు. ఆయన వెనుక ఐశ్యర్య, ఆరాధ్య రావడం కనిపించింది. వారు కారు వద్దకు వెళ్ళినప్పుడు, అభిషేక్‌ కారు డోర్‌ తీయగానే.. ఐశ్వర్య, ఆరాధ్య కారులో కూర్చున్నారు. కారులోపల కూర్చున్న ఐశ్వర్య “హ్యాపీ న్యూ ఇయర్, గాడ్ బ్లెస్” అంటూ అక్కడి వారిని పకలరించారు.

అభిషేక్ నలుపు రంగు ట్రాక్‌తో, గ్రే హూడీని ధరించగా, ఐశ్వర్య సాధారణ నలుపు రంగు స్వెట్‌షర్ట్ , జెగ్గింగ్‌లను ధరించింది. ఆరాధ్య నిండు నీలం రంగు షర్ట్‌లో కనిపించింది.

గత కొంతకాలంగా విడాకుల పుకార్లు

అభిషేక్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ విడాకుల గురించి గత కొంత కాలంగా సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. జులైలో జరిగిన ఒక హై-ప్రొఫైల్ వెడ్డింగ్‌లో ఈ జంట విడివిడిగా వచ్చినప్పుడు ఈ రూమర్‌లు ఎక్కువయ్యాయి. విడాకుల పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్టుగా.. “డైవోర్స్” గురించి చర్చిస్తున్న ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు అభిషేక్‌ లైక్‌ కొట్టడంతో ఊహాగానాలు ఎక్కువయ్యాయి.

అభిషేక్ బచ్చన్ లైక్ చేసిన ఈ పోస్ట్.. విడాకులు, విడిపోవడానికి సంబంధించినది. . చాలా కాలంగా పెళ్లయిన జంటలు ఇప్పుడు విడిపోతున్నారు. వారి నిర్ణయానికి కారణమేమిటి , విడాకులు ఎందుకు పెరుగుతున్నాయి?” అనే టాపిక్‌కి సంబంధించినది.

అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఏప్రిల్ 2007లో వివాహం చేసుకున్నారు. జంటకు నవంబర్ 2011లో ఆరాధ్య బచ్చన్‌ పుట్టింది. ఇప్పటివరకు, ఈ జంట విడాకుల పుకార్లను ధృవీకరించలేదు, ఖండించలేదు.

ఇక అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యారాయ్‌ కలిసి థాయ్‌ అక్షర్ ప్రేమ్ కే (2000), కుచ్ నా కహో (2003), ధూమ్ 2 (2006), ఉమ్రావ్ జాన్ (2006), గురు (2007), సర్కార్ రాజ్ (2008), రావన్ (2010) వంటి అనేక చిత్రాలలో కలిసి పనిచేశారు.

Latest Articles

హ్యూమన్ బాడీలో హార్ట్ మేజర్ పార్ట్

అనారోగ్యం దౌర్భాగ్యం, ఆరోగ్యం మహాభాగ్యం. ఇది నిజమే. అయితే, ఆ మహాభాగ్య ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషించే శరీర అంతర్గత అవయవం ఏమిటి..? ఇంకేమిటి నిస్సందేహంగా హృదయమే. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచేంద్రియాలు..వేటి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్