స్వతంత్ర వెబ్ డెస్క్: జెడి చక్రవర్తి స్వీయ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ ‘హూ’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డబ్బింగ్, ఎడిటింగ్, వంటి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ కి రెడీ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రెడ్డమ్మ బాలాజీ. కే మాట్లాడుతూ.. ‘హూ’ చిత్రాన్ని జెడి చక్రవర్తి స్వీయ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపుదిద్దుకున్న ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ అని చెప్పారు. ఈ సినిమాలో జెడి చక్రవర్తి నటన చాలా వైవిధ్యంగా ఉంటుందని.. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని చెప్పారు. ఈ చిత్రం ఇప్పుడు సెన్సార్ కి రెడీ అవుతున్నట్లు నిర్మాత తెలిపారు. సంగీతం పరంగా ఈ చిత్రం కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామని ఈ చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలో జెడి చక్రవర్తితో పాటు శుభ, నిత్య, వినయ్ ప్రసాద్, విజయ్ చందరం, సునీల్ పూర్ణిక్, రమేష్ పండిట్, హర్షిత, ఉగ్రం రవి, శరణ్య, సనత్, నాగేంద్ర ముఖ్యపాత్రల్లోనటిస్తున్నారు. ఈ చిత్తానికి సంగీతాన్ని ఈశ్వర్ చాంద్ అందిస్తుండగా.. రెడ్డమ్మ బాలాజీ కె ప్రొడ్యూస్ చేస్తున్నారు.