ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో రాజకీయం జరుగుతోందనే అనుమానం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్. నామినేషన్ ప్రక్రియలో ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ కొమ్ము కాసినట్లు అనిపించిందని రాజమండ్రిలో అన్నారు. నామినేషన్ స్క్రూటినీ ప్రాసెస్‌లో స్వతంత్ర అభ్యర్థి, తన కొడుకు జీవీ సుందర్ ప్రత్యర్థి అభ్యర్థులపై కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారని హర్షకుమార్ తెలిపారు. మొదట సీపీఎం అభ్యర్థి వీరరాఘవరావు డిస్‌క్వాలిఫై అయినట్లు ప్రకటించారన్నారు. తర్వాత అతను క్వాలిఫై అయినట్టు లిస్టులో తెలిపారని చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్మన్న తన కుమారుడు సుందర్‌ని గెలిపించాలని హర్షకుమార్ విజ్ఞప్తి చేశారు.