కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. ఉప్పాడలో కోతకు గురైన సముద్ర తీర ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక మత్స్యకారులతో మాట్లా డారు. అంతకు ముందు కాకినాడ వాకతిప్ప ఫిషింగ్ హార్బర్ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం సూరప్ప తాగునీటి చెరువునూ పరిశీలించారు. స్థానిక సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నా రు. ప్రతి గ్రామానికి నీటి సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సాయంత్రం కృతజ్ఞత బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు.