మెగా డీఎస్సీ పారదర్శకంగా నిర్వహించామని ఏపీ విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్ తెలిపారు. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించామన్నారు. డీఎస్సీ నిర్వహణ కోసం 42వేల ప్రశ్నలతో కొశ్చన్ బ్యాంక్ తయారుచేశామన్నారు. ప్రశ్న పత్రం తయారీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. టీసీఎస్ ఐకాన్ సంస్థ సహకారంతో ప్రశ్న పత్రం తయారుచేశామని తెలిపారు. ప్రశ్న పత్రం తయారు చేసే కంప్యూటర్ల పాస్‌వర్డ్‌లు ప్రతి రోజూ మార్చామని వెల్లడించారు. ఫస్ట్ ర్యాంకర్ నవీన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి హాజరు కాలేదని పేర్కొన్నారు. రూల్ 26 ప్రకారం వెరిఫికేషన్‌కి హాజరుకాకపోతే ఉద్యోగం ఇవ్వలేమని స్పష్టం చేశారు. టెట్ స్కోర్, డీఎస్సీ మార్కులు, మెరిట్ లిస్ట్ వెబ్ సైట్‌లో పెట్టామని ఏపీ విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్ వెల్లడించారు.
మెగా డీఎస్సీ ప్రశ్న పత్రం తయారీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రమేయం లేదు- ఏపీ విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్
0
17
Latest Articles
పులివెందులను కాపాడుకోవడానికి వైఎస్ జగన్ ఏం చేయబోతున్నారు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే పులివెందుల నియోజకవర్గం ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఆ గడ్డపై, ఇప్పుడు ఆధిపత్య పోరు రసవత్తరంగా మారుతోంది. ఈ...
- Advertisement -
- Advertisement -


