ఏపీలో సామాజిక పింఛన్‌దారులకు ఒక రోజు ముందుగానే పెన్షన్ అందనుంది. సెప్జెంబర్ నెల ఒకటవ తేదీన ఇచ్చే పించన్ డబ్బులను ఆగస్టు 31నే పంపిణీ చేయనుంది సర్కార్. ఆదివారం సెలవుకావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. ఒకవేళ, ఏదైనా కారణంతో పెన్షన్లు తీసుకోని వారికి సెప్టెంబరు 2వ తేదీన ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెలా 1వ తేదీనే పెన్షన్లను పంపిణీ చేస్తోంది కూటమి సర్కార్. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారంకావడంతో ఒకరోజు ముందుగానే లబ్దిదారులకు పెన్షన్ నగదు అందనుంది.