31.1 C
Hyderabad
Tuesday, June 17, 2025
spot_img

త్యాగరాయ గానసభలో ఏడో ఆడిటోరియం ప్రారంభం

హైదరాబాద్ : దశాబ్దాల ఘన సాంస్కృతిక, సాహిత్య చరిత్రతో ఎందరో కళాకారుల, సాహిత్యకారుల వైభవానికి కళామతల్లిగా ఆశీర్వదించిన శ్రీ త్యాగరాయ గానసభలో అనేక సంగీత ఉత్సవాలకు, ఉచిత సంగీత, నాట్య తరగతులకు నూతనంగా ఏడవ ఆడిటోరియం ను ప్రారంభించడం శుభ పరిణామమని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కె.వి.రమణాచారి పేర్కొన్నారు.

హైదరాబాద్ శ్రీ త్యాగరాయ గానసభలో నూతనంగా ఏర్పాటైన సంగీత నాట్య కళా వేదికను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసిన ప్రముఖ రచయిత, ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారిక మాసపత్రిక ‘ ఆరాధన ‘ పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ మాట్లాడుతూ … సంగీత, నాట్య రంగాలలో క్రొత్త తరాల శిక్షణకోసం శ్రమించి, పరిశ్రమించి మరీ త్యాగరాయ గానసభ అధ్యక్షులు జనార్ధన మూర్తి ఇంత వైభవాన్ని మిత్రుల సహకారంతో నిర్మించడం ఏడుకొండలవాడి దయేనని అభినందించారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు , త్యాగరాయ గానసభ అధ్యక్షులు కళా జనార్ధన మూర్తి అధ్యక్షత వహించారు.సభలు, సమావేశాలకు సహజంగా దూరంగా వుండే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఈ చక్కని కార్యక్రమానికి హాజరవ్వడంతో పలువురు సాహితీ, సాంసృతిక రంగాల ప్రముఖులు ఆప్యాయంగా పలకరించడం విశేషం.

ప్రముఖ పాత్రికేయులు శంకరనారాయణ, త్యాగరాయగాన సభ కమిటీ సభ్యులు చక్రపాణి ప్రసాద్, శ్రీమతి,పద్మజ నీలిమ , శ్రీమతి గీత తదితరులు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సభలు, సమావేశాలకు సహజంగా దూరంగా వుండే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఈ చక్కని కార్యక్రమానికి హాజరవ్వడంతో పలువురు సాహితీ, సాంసృతిక రంగాల ప్రముఖులు ఆప్యాయంగా పలకరించడం విశేషం.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్