కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసిపి మాజీ ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. ప్రతిపాడు వైసిపి పార్టీ ఇంచార్జ్ పద్మనాభం తనయుడు ముద్రగడ గిరిబాబుతో కలిసి శంఖవరం వెళ్లి మాజీ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, బాపన్నమ్మ, శంఖవరం ఎంపీపీ, పర్వత గుర్రాజు( రాజుబాబు) ఇళ్లకు వెళ్లారు ముద్రగడ.
ముద్రగడ, పర్వత కుటుంబాల మధ్య కొంతకాలంగా వైరం ఉంది. ఎమ్మెల్యేగా పర్వత ఉన్న సమయంలోనూ అనేక విషయాలపై విబేధాలు తలెత్తాయి. విభేదాలను పక్కన పెట్టి పర్వత ఇంటికి వెళ్లారు ముద్రగడ.