ఇండియా- చైనా సరిహద్దులోని తూర్పు సెక్టార్లో నిర్మించిన సేలా టన్నెల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిం చారు. అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఈటానగర్‌లో నిర్వహించిన వికసిత్ భారత్- వికసిత్ నార్త్ ఈస్ట్ కార్యక్రమంలో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. సేలా టన్నెల్‌ను సముద్ర మట్టానికి 13వేల అడుగుల ఎత్తులో పర్వతాల మధ్య నిర్మించారు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా బాలిపారా, చారిదౌర్, తవాండ్ రహదారిలో ఆటంకాలు ఎదురవ్వకుండా ఉండే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. సరిహద్దు రహదారుల సంస్థ ఈ రెండు వరుసల టన్నెల్‌ను నిర్మించింది. సరిహద్దు రహదారుల సంస్థ ఈ రెండు వరుసల టన్నెల్‌ను నిర్మించింది. ఈ ప్రాజెక్టులో రెండు సొరంగా లు ఉన్నాయి. టన్నెల్-1 సింగిల్ ట్యూబ్‌తో 1,003 మీటర్ల పొడవుండగా… టన్నెల్-2 రెండు సొరంగమా ర్గాలతో 1,595 మీటర్ల పొడవు కలిగి ఉంది. రెండింటిని కలిపే రోడ్డు పొడవు 1200 మీటర్లు. టన్నెల్-2 సొరంగమార్గాల్లో ఒకటి సాధారణ ట్రాఫిక్‌కు, మరొకటి ఎమర్జెన్సీ సర్వీసులకు కేటాయించారు. పర్వతాల మధ్య సేలా పాస్‌కు 400 మీటర్ల దిగువన ఈ నిర్మాణం చేపట్టారు.
ఈ టన్నెల్ వల్ల చలికాలంలో కూడా రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదు. భారత్-చైనా సరిహద్దులో ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా ఆయుధాలు, బలగాలను వేగంగా తరలించేం దుకు ఉపయోగకరంగా ఉంటుంది. సరిహద్దు ప్రాంత ప్రజలకు సామాజిక, ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చనుంది. దీంతో తవాంగ్, దిరాంగ్ ప్రాంతాల మధ్య 12 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. 90 నిమిషాల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఈ టన్నెల్ మెరుగైన భద్రతా సామర్థ్యాన్ని కలిగి ఉంది. వెంటిలేషన్ వ్యవస్థలు, లైటింగ్, అగ్నిమాపక పరికరాలు వంటి అధునాతన సదుపాయాలను సొరంగా ల్లో ఏర్పాటు చేశారు. సేలా టన్నెల్‌ను సముద్ర మట్టానికి 13వేల అడుగుల ఎత్తులో పర్వతాల మధ్య నిర్మించారు. ప్రపంచంలోనే పొడవైన రెండు వరుసల టన్నెల్‌గా గుర్తింపు పొందింది. 2019 ఫిబ్రవరి 9న ప్రధాని నరేంద్రమోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దీనికోసం ప్రభుత్వం రూ.825 కోట్లు వెచ్చిం చింది.


