సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పాశమైలారం పారిశ్రామికవాడలో వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారాన్ని మంత్రులు దామోద రాజనర్సింహ, కొండా సురేఖ, శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్‌లు ప్రారంభించారు. పరిశ్రమల్లో కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం అధునాతన టెక్నాలజీతో CETP ప్రాజెక్టును ప్రారంభించుకున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం సైతం ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉందన్నారు. ఈ ప్లాంటుకు 104 కోట్లు కాగా PCB శాఖ ద్వారా 25 కోట్లు మంజూరు చేసిందన్నారు.ఇందిరాగాంధీ హయాంలో పాశమైలారంలో 1980లో పరిశ్రమలను స్థాపిం చారని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. వాతావరణాన్ని కాలుష్యం నుంచి కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పరిశ్రమల ద్వారా వచ్చిన వ్యర్థాలను శుద్ధి చేసేందుకు CETPని ప్రారంభించుకో వడం చాలా అనందంగా ఉందన్నారు. మైనింగ్, పారిశ్రామిక రంగం వల్ల పొల్యూషన్ పేరుకుపోయిం దన్నారు. సీఎం రేవంత్ నేతృత్వంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడుతామని ఆయన హామీ ఇచ్చారు.
పాశమైలారంలో వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారం ప్రారంభం
0
228
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


