పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్షలో మంత్రి తుమ్మల

మార్కెట్‌లోకి పత్తి వచ్చే సీజన్‌కు ముందుగానే జిన్నింగ్‌ మిల్లులను సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో అన్నారు. కొనుగోలు కేంద్రాలు వారంలో ఆరు రోజుల పాటు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కనిష్ఠ మద్ధతు ధర, పత్తి సేకరణ మార్గదర్శకాల గురించి రైతులకు ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. సచివాలయంలో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, కాటన్‌ అసోసియేషన్‌, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు.

రాష్ట్ర కాటన్‌ వెల్ఫేర్‌ కమిటీతో పాటు జిల్లా కమిటీల్లోకి కాటన్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, రైతు ప్రతినిధులను కూడా చేర్చుకోవాలని సీసీఐ ప్రతినిధులకు తుమ్మల సూచించారు. ఈ ఏడాది సాంకేతికంగా తీసుకువస్తున్న పేమెంట్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌, మొబైల్‌ యాప్‌లతో మిల్లర్లకు కొనుగోళ్లలో మరింత పారదర్శకతకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా సీసీఐ, కాటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులు పలు సమస్యలు లేవనెత్తారు. వీటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

Latest Articles

క్రిష్ ప్రయోగం ఫలించేనా..?

మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్