అనతి కాలంలోనే 25 సినిమాలను నిర్మించి.. త్వరలో 50 సినిమాలను పూర్తి చేసేందుకు దూసుకెళుతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాకర్టీ. ఈ సంస్థ పేరుకు తగ్గట్టుగానే ఒక ఫ్యాక్టరీలా సినిమాలను నిర్మిస్తుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ది రాజాసాబ్ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ క్రేజీ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుది. ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఏప్రిల్ 10న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే.. ఈ నిర్మాణ సంస్థ నుంచి త్వరలో శ్రీవిష్ణు శ్వాగ్ మూవీ రిలీజ్ కానుంది. అలాగే మరి కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. వీటిలో ఓ భారీ లేడీ ఓరియంటెడ్ మూవీ ఉందట. ఈ భారీ, క్రేజీ లేడీ ఓరియంటెడ్ మూవీలో నటించే కథానాయిక ఎవరంటే.. శృతి హాసన్, తమన్నా, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నలుగురులో ఎవరో ఒకర్ని త్వరలో ఫైనల్ చేస్తారని తెలిసింది. ప్రవీణ్ ఐపీఎస్ అనే సినిమాను తెరకెక్కించిన దుర్గాదేవ్ నాయుడు ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నట్టుగా సమాచారం. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో.. వావ్ అనిపించేలా.. ఆడియన్స్ కి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా ఈ మూవీని డిజైన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో ఈ సినిమాను అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.