28.2 C
Hyderabad
Monday, May 4, 2026
spot_img

రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరిపై మాజీమంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా కాంగ్రెస్‌ ప్రభుత్వం, రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేకు పీఏసీ ఛైర్మన్ పదవా.. సిగ్గు సిగ్గు అని విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఇదేం దుర్మార్గమని నిలదీశారు. ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ హోదాను, పార్టీ మారిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం ఎక్కడి సంస్కృతి అని కేటీఆర్ ప్రశ్నించారు.

గీత దాటిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని పూర్తిగా కాలరాస్తోందని విమర్శించారు. సంప్రదాయాలను మంటగలుపుతోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆక్షేపించారు. పార్లమెంట్‌లో పీఏసీ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేసీ వేణుగోపాల్‌కు కట్టబెట్టిన విషయం మరిచారా.. అని అడిగారు. దేశ అత్యున్నత చట్టసభలో ఒక న్యాయం.. రాష్ట్ర అత్యున్నత చట్టసభలో మాత్రం అన్యాయమా.. అని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఎక్స్‌ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.

Latest Articles

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్