మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో చుక్కెదురు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు  హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదని దాఖలైన పిటిషన్ ను కొట్టివేయాలని  వేసిన  పిటిషన్ ను  హైకోర్టు మంగళవారంనాడు కొట్టి వేసింది. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు  వివరాలు ఇచ్చారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్ర రాజు  అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ కు  కొనసాగే అర్హత లేదని ఆ పిటిషన్ లో  రాఘవేంద్ర రాజు  పేర్కొన్నారు. రాఘవేంద్రరాజు పిటిషన్ కు  తెలంగాణ హైకోర్టు అనుమతిని ఇచ్చింది. తనపై దాఖలైన పిటిషన్ ను  కొట్టివేయాలని కోరుతూ  మంత్రి శ్రీనివాస్ గౌడ్  తెలంగాణ హైకోర్టులో దాఖలు చేశారు.ఈ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది.

2018  ఎన్నికల సమయంలో నామినేషన్ తో పాటు అఫిడవిట్ ను  మంత్రి శ్రీనివాస్ గౌడ్ దాఖలు  చేశారు.  అయితే  ఎన్నికల సమయంలో శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేసిన  అఫిడవిట్ స్థానంలో కొత్త అఫిడవిట్ అప్ లోడ్  చేశారనే ఆయన ప్రత్యర్థులు ఆరోపణలు  చేశారు. ఈ విషయమై  రాఘవేందర్ రాజు  కేంద్ర ఎన్నికల సంఘానికి కూడ ఫిర్యాదు  చేశారు.  ఈ విషయమై విచారణ జరుగుతుంది. ఇదిలా ఉంటే  ఇదే విషయమై హైకోర్టులో  రాఘవేందర్ రాజు  దాఖలు చేసిన పిటిషన్ పై  మంత్రి శ్రీనివాస్ గౌడ్ సవాల్ చేశారు. మంత్రి పిటిషన్ ను  హైకోర్టు కొట్టివేసింది.

Latest Articles

బాల్క సుమన్ అరెస్ట్

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయవాదుల సమక్షంలో ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు. బాల్క సుమన్‌ను నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు. బాల్క సుమన్‌ వెంట అతని లాయర్‌ లక్ష్మణ్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్