34.2 C
Hyderabad
Monday, March 17, 2025
spot_img

August New Rules: టిఫిన్, టీ ధరలు పెరగబోతున్నాయ్..!

స్వతంత్ర వెబ్ డెస్క్: నిత్యావసర వస్తువుల ధరలు అకాశాన్నంటడంతో టిఫిన్‌ ధరలను 10 శాతం మేరకు పెంచాలని బృహత్‌ బెంగళూరు హోటళ్ల సంఘం నిర్ణయించింది. సంఘం గౌరవ కార్యదర్శి వీరేంద్ర కామత్‌ ఈ మేరకు నగరంలో సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే బియ్యం, కూరగాయల ధరలు బాగా పెరిగాయని, వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ ధరల అధికంగా ఉన్నాయని ఆ ప్రకటనలో తెలిపారు.

ఆగస్టు 1 నుంచి లీటరు పాల ధర రూ. 3 పెరుగుతోందని, కిలో కాఫీ పొడి ధర రూ. 100 వరకు పెరిగిందని ఈ నేపథ్యంలో టీ, కాఫీ(Tea, coffee) ధరలు కూడా రూ.2 నుంచి రూ.3 వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. టిఫిన్ల ధరలు రూ. 5 మేరకు, భోజనం ధరలు రూ. 10 మేరకు పెరిగే అవకాశం ఉందన్నారు. వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌ సమయంలో రెండేళ్లపాటు బాగా దెబ్బతిన్న హోటల్‌ పరిశ్రమ ఇపుడిపుడే కోలుకుంటున్న తరుణంలో ధరాఘా తం బాగా తగిలిందని, పెరిగిన ధరలతో హోటళ్ల నిర్వహణ చాలాకష్టంగా మారిందని ప్రకటనలో తెలిపారు.

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్